Share News

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:12 AM

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయమని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు నెలకు 500 యూనిట్లు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించారు.

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయం
సంతకవిటి: నేతన్నలకు ఉచిత పథకం గురించి వివరిస్తున్న కోండ్రు మురళీమోహన్‌ :

చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయమని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు నెలకు 500 యూనిట్లు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించారు.

కార్మికుల జీవనోపాధికి ఊతం: కోండ్రు

సంతకవిటి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ పథకం వల్ల కుటుంబాలపై విద్యుత్‌ భారం తగ్గి, వారి జీవనోపాధికి ఊతమిస్తుందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. సురవరంలోని చేనేతలకు ఉచిత విద్యుత్‌ పఽథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్ల అప్పలనాయుడు, వల్లూరు గణేష్‌, గట్టి భాను, చెలికాని మహేష్‌, సమతం శ్రీనివాసరావు, గట్టి రఘ, గురవాన నారాయణరావు, సుమల మన్మఽథరావు, మెయ్యి నారాయణప్పడు, దుప్పలపూడి శ్రీను పాల్గొన్నారు,

చేనేత వస్త్రాలు ధరించాలి: కోళ్ల

వేపాడ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ల పిలుపు మేరకు ప్రజలతా వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరించి కళాకారులకు తోడ్పడాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు. బుధవారం వల్లంపూడిలో చేనేత కార్మికులకు సంబంధించి ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ పథకం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉచిత పథకం వల్ల కలిగే లబ్ధి, పథకం అమలు తీరు గురించి వివరించారు. నేతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని తెలిపారు. కార్య క్రమంలో తహసీల్దార్‌ రాములమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణ, టీడీపీ మండ లాధ్యక్షుడు గొంప వెంకటరావు, ఉపాధ్యక్షుడు పొతల వెంకటరమణ, గుమ్మడి భారతి, గుంటపల్లి దేముడుబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 12:12 AM