Fog మంచు దుప్పట్లో మన్యం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:24 AM
The Agency Wrapped in a Blanket of Fog జిల్లాను మంచు దుప్పటి కమ్మేస్తోంది. సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగింది.
మరో మూడు రోజులు మరింత తీవ్రం
ప్రకటించిన వాతావరణ శాఖ
పాలకొండ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాను మంచు దుప్పటి కమ్మేస్తోంది. సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. మరోవైపు చలి తీవ్రత కూడా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 14 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత పది రోజులుగా జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొందరు రగ్గులు, స్వెట్టర్లు ఇతర ఉన్ని వస్ర్తాలను ధరించి చలి, మంచు నుంచి రక్షణ పొందుతున్నారు. మరికొందరు మంటలు వేసుకుంటున్నారు. పండుగ వెళ్లిపోయినా చలి, పొగమంచు తగ్గకపో వడంతో ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు వాహనదారులు సైతం రాకపోకలు సాగించలేక పోతున్నారు. లైట్లు వేసుకున్నా.. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. పొగమంచు ప్రభావం వాణిజ్య పంటలపై కనిపిస్తుంది. పూత దశలో ఉన్న మామిమిడి, జీడిమామిడి, పెసర, మినుము పంట మాడిపోతుంది.
వాతావరణ శాఖ హెచ్చరిక..
జిల్లాలో మరో మూడు రోజుల పాటు పొగమంచు అధికంగా కురిసే అవకాశముందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని ప్రకటించింది. వాహనదారులు ఉదయం 9 గంటల తర్వాత ప్రయాణం చేయడం సురక్షితని పేర్కొంది. వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. సంక్రాంతి పండుగ అనంతరం సొంత వాహనాల్లో తిరుగుప్రయాణాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, రవాణాశాఖాధికారులు సూచిస్తున్నారు.