Share News

30 ఏళ్లుగా ఆ పంచాయతీ ఏకగ్రీవం

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:02 AM

That Panchayat Has Been Unanimous for 30 Years పాచిపెంట మండలం ఏవోబీ సరిహద్దు ప్రాంతం... గిరిశిఖర పంచాయతీ ఆజూరు గత 30 ఏళ్లుగా ఏకగ్రీవమవుతుంది. ఈ పంచాయతీ పరిధిలో ఆజూరుతో పాటు కుంబివలస, చాకిరాయివలస గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 391 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలో గిరిజనులంతా ఎస్టీ కొందొరకు చెందినవారు. ఎన్నికల సమయంలో వారంతా ఒకేమాటకు కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆజూరుకి చెందిన చోడిపల్లి సూరయ్య కుటుంబాన్ని మూడు దశాబ్దాల పాటు సర్పంచ్‌ పదవి వరిస్తోంది.

30 ఏళ్లుగా ఆ పంచాయతీ ఏకగ్రీవం
ఆజూరు గ్రామం

పాచిపెంట రూరల్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం ఏవోబీ సరిహద్దు ప్రాంతం... గిరిశిఖర పంచాయతీ ఆజూరు గత 30 ఏళ్లుగా ఏకగ్రీవమవుతుంది. ఈ పంచాయతీ పరిధిలో ఆజూరుతో పాటు కుంబివలస, చాకిరాయివలస గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 391 మంది ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలో గిరిజనులంతా ఎస్టీ కొందొరకు చెందినవారు. ఎన్నికల సమయంలో వారంతా ఒకేమాటకు కట్టుబడి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆజూరుకి చెందిన చోడిపల్లి సూరయ్య కుటుంబాన్ని మూడు దశాబ్దాల పాటు సర్పంచ్‌ పదవి వరిస్తోంది. 1996 నుంచి 2001 వరకు సూరయ్య ఏకగ్రీవ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2016 వరకు సూరయ్య అన్న కుమారుడు చోడిపల్లి అప్పలస్వామి , 2016లో ఇక్కడ ఎస్టీ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించడంతో సూరయ్య కోడలు రాధను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 2021లో సూరయ్య కుమారుడు సుందరరావు ఏకగ్రీవ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సారి సర్పంచ్‌ ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో కూడా పంచాయతీ ఏకగ్రీవం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. సూరయ్య కుటుంబానికి ఈసారి కూడా పంచాయతీ పదవి వరిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

Updated Date - Nov 23 , 2026 | 12:02 AM