ఆ భూమి దుప్పాడ రామాలయానిదే
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:00 AM
విజయనగరం మండలంలోని దుప్పాడలో సర్వే నెంబరు 2/2, 2/16లో 4.62 ఎకరాల భూమి ఆ గ్రామ రామాలయానిదేనని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు.
విజయనగరం కల్చరల్,ఆగస్టు 5 ( ఆంరఽధజ్యోతి): విజయనగరం మండలంలోని దుప్పాడలో సర్వే నెంబరు 2/2, 2/16లో 4.62 ఎకరాల భూమి ఆ గ్రామ రామాలయానిదేనని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష తెలిపారు. ఈ భూమి చుట్టూ దేవదాయశాఖ అనుమతి లేకుండా ప్రహరీ అక్రమంగా నిర్మిం చారని, ఈ విషయంపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. ఈ మేరకు బుధవారం క్షేత్రస్థాయిలో విచారణచేశారు. ఆ భూమి దుప్పాడ శ్రీరాముల దేవస్థానానికి సంబంధించిన హక్కు భుక్తంనకు చెందినదని పేర్కొన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ సిబ్బంది, పోలీసులతో కలిసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమి దుప్పాడ లో రామాలయానికి చెందిందని ఈ భూమిపై ఎవరికీ ఏ విధమైన హక్కులు లేవని, అక్రమణదారులు శిక్షార్హులని ఆమె పేర్కొన్నారు.