కుమార్తె ఇకలేదని..
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:31 AM
తన కుమార్తె మృతి చెందడంతో ఓ తల్లి మనోవేదనకు గురైంది. కుమార్తె లేని లోకంలో తాను ఇక ఉండలేనని ఆత్మహత్య చేసుకుంది.
గరుగుబిల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె మృతి చెందడంతో ఓ తల్లి మనోవేదనకు గురైంది. కుమార్తె లేని లోకంలో తాను ఇక ఉండలేనని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావివలస గ్రామానికి చెందిన చింత సుజాత(43) బుధవారం ఉదయం మనస్తాపంతో గడ్డి మందు తాగింది. ఆమె అస్వస్థతకు గురికావడంతో భర్త సింహాచలం వెంటనే చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మూడు రోజుల కిందట తన కుమార్తె అనిత అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి సుజాత తీవ్ర మనోవేదనకు గురైంది. దాంతో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై హెచ్‌సీ రాము కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లో కుమార్తె, తల్లి మృతిచెందడంతో రావివలసలో విషాదం చోటుచేసుకుంది.