Share News

Thank you, CM Sir. థాంక్యూ సీఎం సార్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:47 PM

Thank you, CM Sir. తమకు రావాల్సిన పరిహారం కోసం ఎన్నో పోరాటాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని, సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భీమసింగి సుగర్స్‌ కార్మికుల హర్షం వ్యక్తం చేశారు. తమ తరపున పట్టువదలని విక్రమార్కుడులా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అండగా ఉన్నారని అన్నారు. 300మంది కార్మికులకు రావాల్సిన రూ.9కోట్ల 12లక్షలు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా వారంతా మంగళవారం సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు.

Thank you, CM Sir. థాంక్యూ సీఎం సార్‌
భీమసింగి సుగర్స్‌ గేటు వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న కార్మికులు

థాంక్యూ సీఎం సార్‌

విక్రమార్కుడిలా అండగా ఉన్నారంటూ కొండపల్లికి కితాబు

పరిహారం విడుదలపై భీమసింగి సుగర్స్‌ కార్మికుల హర్షం

జామి,సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): తమకు రావాల్సిన పరిహారం కోసం ఎన్నో పోరాటాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిందని, సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని భీమసింగి సుగర్స్‌ కార్మికుల హర్షం వ్యక్తం చేశారు. తమ తరపున పట్టువదలని విక్రమార్కుడులా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అండగా ఉన్నారని అన్నారు. 300మంది కార్మికులకు రావాల్సిన రూ.9కోట్ల 12లక్షలు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా వారంతా మంగళవారం సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆధునికీకరణ పేరుతో తిరుగుతున్న ఫ్యాక్టరీని మూసేశారని, తరువాత అటకెక్కి పరిశ్రమలో యంత్రాలు పూర్తిగా పోయాయన్నారు. ఎన్నికల సమయంలో కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చామని, ఆ మాట ప్రకారం ఫ్యాక్టరీ విషయంపై ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, తాను ఆసెంబ్లీలో పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించి కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వం త్వరలోనే ఫ్యాక్టరీ షేర్‌హోల్డర్‌ రైతులతో మహాజనసభ నిర్వహిస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వలస వెళ్తున్న యువతను ఆపి ఇక్కడే పలు రకాల పరిశ్రమలు ఏర్పాటుచేసి వారికి ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, ఫ్యాక్టరీ ఎండీ వీఎస్‌ నాయుడు, టీడీపీ మండల ఆధ్యక్ష,కార్యదర్శులు స్వామినాయుడు,పైడిరాజు, టీడీపీ నేత సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

చిన్ననాటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి

తన చిన్నతనంలో ఈ సుగర్‌ ఫ్యాక్టరీకి తన తాత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడుతో ఎడ్లబండిపై చెరుకు తెచ్చినప్పుడు తాను కూడా వెంట వచ్చేవాడినని మంత్రి శ్రీనివాస్‌ గుర్తు చేశారు. పంటను దింపాక చెరకు గడలను ఎంతో ఇష్టంగా తినేవాడినన్నారు. ఫ్యాక్టరీ విషయంలో ఎవ్వరికీ అన్యాయం జరగదని మరోసారి స్పష్టంచేశారు.

Updated Date - Sep 29 , 2026 | 11:47 PM