Share News

మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:20 AM

బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగలు గురువా రం ఉదయం హల్‌చల్‌ చేశారు.

  మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

  • బస్సు ఎక్కుతుండగా ఘటన

  • మరో ప్రయాణికుడి జేబులో రూ.7 వేలు అపహరణ

బొబ్బిలి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దొంగలు గురువా రం ఉదయం హల్‌చల్‌ చేశారు. మహిళ మెడలో మూడు తులాల బంగారు పుస్తెలతాడు, మరో ప్రయాణీకుని జేబులో నుంచి రూ.7వేలను కాజేశారు. ఇందు కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక స్వామివారి వీధికి చెందిన బోరసింగి అచ్చయ్యమ్మ తన తల్లి, చెల్లితో కలిసి విజయనగరంలో తమ బంధువు ల ఇంట జరిగే శుభకార్యానికి బయలుదేరింది. విశాఖపట్నం వెళుతున్న పార్వతీ పురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఆమె ఎక్కుతుండగా అక్కడ కాపు కాసిన దొంగ ఆమె మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచి పారిపోయాడు. ఆభరణం పోయినట్టు గమనించిన ఆమె లబోదిబోమంటూ వెంట నే పోలీసులను ఆశ్రయించింది. అదే బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న బలి జిపేట గ్రామానికి చెందిన గోపాలం జేబులో నుంచి రూ.7వేలను దొంగలించారు. రెండు ఘటనలు ఒకేసారి జరిగాయి. ఇది ఒక దొంగ చేశాడా? లేక ఇంకా ఎక్కు వ మంది ఉన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ దొంగతనం జరిగిన వెంటనే బస్సును నిలుపుదల చేసి తనిఖీ చేశారు. సమాచారం తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకొని నిందితుల కోసం గాలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు.

నిందితులను త్వరలో పట్టుకుంటాం: సీఐ

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జరిగిన దొంగతనానికి సంబంధించిన ఫిర్యాదులు అందా యని సీఐ నారాయరావు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టా మన్నారు.. ఘటన జరిగినప్పుడు బస్సు ప్లాట్‌ఫామ్‌పై కాకుండా కొద్ది దూరంగా ఉండటం, మధ్యలో మరో బస్సు రావడంతో నిందితుల ఆచూకీని కనిపెట్టేందుకు వీలు కుదరలేదన్నారు. గట్టి నిఘా పెట్టి నిందితులను పట్టుకుంటామన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:20 AM