Share News

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి

ABN , Publish Date - Jun 06 , 2026 | 11:59 PM

: పాఠశాలల తిరిగిప్రారంభించే నాటికి గిరిజన విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీచేయాలని ఐటీడీఏ డిప్యూటీ ఈవో పి.నారాయడు సూచించారు.

  పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి
పుస్తకాలను పరిశీలిస్తున్న నారాయడు :

సీతంపేట రూరల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పాఠశాలల తిరిగిప్రారంభించే నాటికి గిరిజన విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీచేయాలని ఐటీడీఏ డిప్యూటీ ఈవో పి.నారాయడు సూచించారు. శనివారం సీతంపేట ఎంఆర్‌సీలో ఈఏడాదికి సంబంధించి వచ్చిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల స్టాక్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన బోధన సామగ్రి అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోలను ఆదేశించారు. విద్యాకిట్ల పంపిణీలో జాప్యం లేకుండా ప్రధానో పాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల అభ్యాసా నికి అవసరమైన అన్ని వనరులు సకాలంలో అందించడం ద్వారా విద్యా ప్రమా ణాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 11:59 PM