టెట్ రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:34 AM
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
నెల్లిమర్ల, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను తక్షణమే రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పతివా డ త్రినాథ్ ఆధ్వర్యంలో నెల్లిమర్లలో ఆదివారం జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని, మాట్లాడారు. టెట్ పరీక్షను రద్దుచేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి త గ్గించా లని కోరారు. త్రినాథ్ మాట్లా డుతూ 12వ పీఆర్‌సీ వెంట నే నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెం డింగ్‌లో ఉన్న డీఏలు విడు దల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆడిట్ కమిటీ సభ్యు లు మద్దిల రాజు, యూటీఎఫ్ గుర్ల మండల నాయకులు హరిమోహన్, ఆల్తి చంద్రశేఖర్, నెల్లిమర్ల నాయకులు సుంకర చలపతిరావు, గడిదేసి గోపాల్ పాల్గొన్నారు.