Tet from tomorrow రేపటి నుంచి టెట్
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:14 AM
Tet from tomorrow ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 12,358 మంది అభ్యర్థులు మూడు కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు.
రేపటి నుంచి టెట్
జిల్లాలో హాజరుకానున్న 12,358 మంది అభ్యర్థులు
మూడు కేంద్రాల్లో నిర్వహణ
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయ అర్హత పరీక్ష బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 12,358 మంది అభ్యర్థులు మూడు కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. ఈనెల 5 నుంచి 16వ తేది వరకూ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. ఎంవీజీఆర్‌లో 3059 మంది, సీతం ఇంజనీరింగ్ కాలేజీలో 1571 మంది, ఐయాన్ డిజిటల్ జోన్ లో 7728 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, ఓటర్) తప్పకుండా తీసుకు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు 30 నిమిషాల ముందు చేరుకోవాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం ఇస్తారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ర్టానిక్ పరికరాలు అనుమతించరు. ప్రతి కేంద్రానికీ ఒక డిప్యూటీ తహసీల్దార్ డిపార్టుమెంట్ అధికారిగా ఉంటారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కానుంది. పరీక్షలకు సంబంధించి సందేహాలు, సమస్యల నివృత్తి కోసం అభ్యర్థులు 9550394572, 9618042932, 9989568641 నెంబర్లను సంప్రదించాలని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు.