Share News

Governing Bodies Ends Today నేటితో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:39 AM

Tenure of Governing Bodies Ends Today ఉమ్మడి జిల్లాలో పాలకవర్గాల పదవీ కాలం నేటితో ముగియనుంది. నగర కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలుకానుంది.

  Governing Bodies Ends Today నేటితో ముగియనున్న పాలకవర్గాల పదవీకాలం
సాలూరు మున్సిపల్‌ కార్యాలయం

సాలూరు రూరల్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో పాలకవర్గాల పదవీ కాలం నేటితో ముగియనుంది. నగర కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలుకానుంది. సాలూరుకు పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ వైశాలి, పార్వతీపురానికి జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండకు పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ను ప్రత్యేకాధికారులుగా నియమించారు. విజయనగరం కార్పొరేషన్‌కు ఆ జిల్లా కలెక్టర్‌ రాంసుందర్‌ రెడ్డి, బొబ్బిలికి ఆర్డీవో మోహన రావు, నెల్లిమర్లకు ఆర్డీవో వెంకటేశ్వరరావులను ప్రత్యేకాధికారులను నియమిస్తు మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆరు నెలల వ్యవధిలో స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఈ నెల 13న జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఆరు నెలల కాలంలో మునిసిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోనున్నాయని పట్టణవాసులు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మునిసిపాలిటీల్లో ఓటర్ల జాబితా రూపొం దించే కార్యక్రమం తుది దశకు చేరింది.

Updated Date - Mar 17 , 2026 | 12:39 AM