Share News

‘పది’ విద్యార్థులను దత్తత తీసుకోవాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:33 PM

ప్రతి ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకోవాలని, వెనకబడిన విద్యార్థులకు భాషలు, గణితం విషయాల్లో శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యాల నాయుడు ఆదేశించారు.

  ‘పది’ విద్యార్థులను దత్తత తీసుకోవాలి
కొత్తవలస ఉన్నతపాఠశాల మైదానాన్ని పరిశీలిస్తున్న మాణిక్యాలనాయుడు

కొత్తవలస, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకోవాలని, వెనకబడిన విద్యార్థులకు భాషలు, గణితం విషయాల్లో శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యాల నాయుడు ఆదేశించారు. బుధవారం కొత్తవలస జడ్పీహైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకురావాలని కోరారు. పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎస్‌ఏ-1 పరీక్షలు, పాఠశాలలో రికార్డులు, మరుగుదొడ్లు పరిశీలించారు. పాఠశాల ఆటస్థలంలో అనధికారికంగా ఉన్న చిన్న చిన్న బడ్డీలను వెంటనే తొలగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవోలు జి.శ్రీదేవి, బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బి.గోవింద నాయుడు, మోహనరావు, వంగనండు అప్పారావు, రమణారావు, సన్యాసిరావు, కోటేశ్వరరావు, సత్యారావు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:33 PM