Tenth supplementary exams from today నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 24 , 2026 | 11:39 PM
Tenth supplementary exams from today పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యా శాఖ అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
హాజరు కానున్న 1829 మంది విద్యార్థులు
14 కేంద్రాల్లో నిర్వహణ
విజయనగరం, కలెక్టరేట్ మే 24(ఆంధ్రజ్యోతి): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 5వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యా శాఖ అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో 1829 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందు చేరుకోవాలని విద్యాశాఖాధికారులు సూచించారు. 85 మంది ఇన్విజరేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ విద్యుత్, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు ముగ్గురు ప్లైయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. అవసరమైతే టోల్ ఫ్రీనెంబర్ 9000945346ను సంప్రదించవచ్చు.
-------------