tenth papers evaluation మొదలైన టెన్త్ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:13 AM
tenth papers evaluation పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం నగరంలోని పీఎస్‌ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూల్యాంకనం జరగనుంది.
మొదలైన టెన్త్ మూల్యాంకనం
మొదటి రోజు 10,440 జవాబు పత్రాలను దిద్దిన ఉపాధ్యాయులు
కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం నగరంలోని పీఎస్‌ఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మూల్యాంకనం జరగనుంది. ఏర్పాటు చేసిన 72 టేబుల్స్‌కు తొలిరోజు 16,360 జవాబు పత్రాలు ఇవ్వగా 10,440 పేపర్లకు వాల్యుయేషన్ చేశారు. ఈ ప్రక్రియలో 72 మంది చీఫ్ ఎగ్జామినర్లు , 432 మంది సహాయక ఎగ్జామినర్లు, 2216 మంది స్పెషల్ అసిస్టెంట్లు కలిపి 720 మంది సిబ్బంది భాగస్వాములయ్యారు.
మూల్యాంకనం జరుగుతున్న కేంద్రాన్ని సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ రామసుందర్ రెడ్డి తనిఖీ చేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన స్ర్కిప్టులు, మూల్యాంకనం ప్రక్రియను పరిశీలించారు. ఖచ్చితమైన మూల్యాంకనం చేయాలని సూచించారు. పరీక్షల విశ్వసనీయతకు భంగం కలగకుండా మూల్యాంకనం చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట డీఈవో మాణిక్యం నాయుడు, డీఈసీబీ సెక్రటరీ సన్యాసిరాజు ఉన్నారు.
ఫ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో పిలుపుమేరకు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పది పశ్నాపత్రాల మూల్యాంకనం వద్ద నిరసన చేపట్టారు. సంఘం నాయకుడు పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.