Tenth Hall Tickets క్యూ ఆర్ కోడ్‌తో‘ పది’ హాల్‌టిక్కెట్లు
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:39 PM
Tenth Hall Tickets with QR Code జిల్లాలో పదో తరగతి పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు ఈ ఏడాది క్యూఆర్ కోడ్‌తో హాల్ టిక్కెట్లను జారీ చేశారు.
సాలూరు రూరల్, మార్చి6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు ఈ ఏడాది క్యూఆర్ కోడ్‌తో హాల్ టిక్కెట్లను జారీ చేశారు. జిల్లాలో 223 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 10,646 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలను రాయనున్నారు. ఈ మేరకు 67 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలను విద్యార్థులు సులభంగా గుర్తించేందుకు, సకాలంలో చేరుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్‌లో వివరాలు నిక్షిప్తం చేశారు. కాగా కూటమి ప్రభుత్వం పూర్తి సాంకేతికను వినియోగిస్తూ పది పరీక్షలను నిర్వహిస్తోంది. గతానికి భిన్నంగా డిజిటల్ ఆటోమేషన్ ద్వారా విజయవాడ నుంచే పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు సైతం ఎంపిక చేశారు. లీప్ యాప్ ద్వారా ఇన్విజిలేటర్లు నియామక ఆదేశాలిచ్చారు. విద్యార్థుల నామినల్ రోల్ సైతం డిజిటల్‌గానే జారీ చేశారు.