Share News

ముగిసిన పదో తరగతి పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:42 PM

జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. గత నెల 16న 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ముగిసిన పదో తరగతి పరీక్షలు
వీరఘట్టంలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారం ముగిశాయి. గత నెల 16న 68 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 222 ఉన్నత పాఠశాలల నుంచి 10,646 మంది విద్యార్థులు రాశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 612 మంది ఇన్విజిలేటర్లు, 68 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులతో పాటు మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, సిట్టింగ్‌ స్క్వాడ్లు విధులు నిర్వహించాయి.

6 నుంచి మూల్యాంకనం

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ ఈ నెల 6 నుంచి 15 వరకు పది రోజుల పాటు నిరంతరాయంగా జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రెండు కేంద్రాల్లో డీవీఎంఎంఎ హైస్కూల్‌ (చర్చివీధి), ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ (డిగ్రీ కాలేజీ ఎదురుగా) ఈ మూల్యంకనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 11:42 PM