Share News

Tension.. Tension టెన్షన్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:51 PM

Tension.. Tension అది బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతం. ఆదివారం వేకువజామున ఒక్కసారిగా 82 మంది పోలీసులు అక్కడ దిగారు. అంతే తడవుగా ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టారు. డోర్‌ తెరిచాక క్షణాల్లో లోపలకు వెళ్లి ఇళ్లంతా గాలించారు. వారిని ప్రశ్నించినా ఏ మాట్లాడకపోయే సరికి అందరూ ఆందోళన చెందారు. ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా వచ్చినట్లు తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.

Tension.. Tension టెన్షన్‌.. టెన్షన్‌
ఆధార్‌ కార్డులను పరిశీలిస్తున్న పోలీసులు

టెన్షన్‌.. టెన్షన్‌

ఇందిరమ్మకాలనీలో పోలీసుల హడావుడి

వేకువజామున ఆకస్మిక తనిఖీలు

ఆందోళన చెందిన స్థానికులు

కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా రాక

బొబ్బిలి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):

అది బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీ ప్రాంతం. ఆదివారం వేకువజామున ఒక్కసారిగా 82 మంది పోలీసులు అక్కడ దిగారు. అంతే తడవుగా ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టారు. డోర్‌ తెరిచాక క్షణాల్లో లోపలకు వెళ్లి ఇళ్లంతా గాలించారు. వారిని ప్రశ్నించినా ఏ మాట్లాడకపోయే సరికి అందరూ ఆందోళన చెందారు. ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కార్డెన్‌ సెర్చ్‌లో భాగంగా వచ్చినట్లు తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు.

ఎస్‌పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డీఎస్‌పి భవ్యారెడ్డి, సీఐ కింతలి నారాయణరావు ఆధ్వర్యంలో ఆదివారం వేకువ జామున స్థానిక ఇందిరమ్మకాలనీలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలోని 82 మంది పోలీసు సిబ్బందితో ఏకకాలంలో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించడంతో కాలనీవాసులు ఒకింత కంగారు పడ్డారు. గంజాయి, డ్రగ్స్‌ ఇతర మత్తుపదార్థాలు కలిగి ఉండడం, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల చొరబాటు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై అనుమానం రావడంతో పోలీసులు అమాంతం తనిఖీలకు వచ్చారు. వీధి వీధినా ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలించారు. తనిఖీల్లో రికార్డులు లేని ఆరు ద్విచక్రవాహనాలను గుర్తించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకొస్తే తిరిగి అప్పగిస్తామని సీఐ నారాయణరావు తెలిపారు. గతంలో కేసులు నమోదైన నిందితులైన కొంత మంది నుంచి వేలిముద్రలు సేకరించామన్నారు. బండి చలానాలు చెల్లించని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు. ఈ తరహా తనిఖీలు ప్రతి నెలా ప్రతీ వారం నిర్వహిస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:51 PM