పిడుగు పాటుకు పది మేకల మృతి
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:15 AM
కొండగంగుబూడి గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగు పడి.. పది మేకలు మృతి చెందాయి.
వేపాడ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): కొండగంగుబూడి గ్రామంలో గురువారం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగు పడి.. పది మేకలు మృతి చెందాయి. రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి శ్రీను తన మేకలను మేత కోసం కొండగంగుబూడి విజయరామసాగర్ ఆయకట్టు ప్రాంతానికి తోలుకు వచ్చాడు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో మేపుతుండగా.. ఒక్కసారిగా పిడుగు పడడంతో రెండు మేకపోతులు, ఏడు మేకలు మృతిచెందాయి. అలాగే కొండ గంగుబూడి గ్రామానికి చెందిన చలుమూరి వెంకటరావుకు చెందిన మరో మేక మృతిచెందింది. సుమారు రూ.3లక్షల ఆస్తినష్టం సంభవించిందని గ్రామపెద్ద పర వాడ జగదీష్ తెలిపారు. బాధితులకు ప్రభుత్వం సాయం కోరారు.