Temples రేపు దేవాలయాల మూసివేత
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:34 AM
Temples to Remain Closed Tomorrow చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలను మూసివేయనున్నారు. 4న బుధవారం ఆలయాలన్నింటిలో సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
గరుగుబిల్లి, మార్చి1(ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలను మూసివేయనున్నారు. 4న బుధవారం ఆలయాలన్నింటిలో సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాలను ఈ నెల 3న మూసివేయనున్నట్లు ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉదయం 10 గంటలకు ఉభయ దేవాలయాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. 4న గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి స్వామివారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లావాసులు గమనించాలని ఆయన కోరారు. పాలకొండలో కోటదుర్గమ్మ, శంబర పోలమాంబ దేవాలయాలతో పాటు జిల్లాలో ఇతర ప్రముఖ ఆలయాలను మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా శంబరలో ఐదోవారం జాతర నిర్వహించడం లేదని దేవాలయ సిబ్బంది తెలిపారు.