Share News

నేడు ఆలయాల సంప్రోక్షణ

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:22 AM

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలన్నీ మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.19 గంటల నుంచి సాయంత్రం 6.46 వరకూ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని ముందుగానే పండితులు పేర్కొన్నారు.

నేడు ఆలయాల సంప్రోక్షణ
పైడితల్లి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు

విజయనగరం కల్చరల్‌, మార్చి 3 (ఆంరఽధజ్యోతి): సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలన్నీ మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.19 గంటల నుంచి సాయంత్రం 6.46 వరకూ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని ముందుగానే పండితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నింటినీ మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్టు దేవదాయశాఖాధికారులు తెలిపారు. గ్రహణం కారణంగా జిల్లా కేంద్రంలో నిర్మానుష్య వాతావరణం కన్పించింది.

Updated Date - Mar 04 , 2026 | 12:22 AM