Share News

పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు తొలగించాలి

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:18 AM

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.

పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు తొలగించాలి

  • ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నా రు. చీపురుపల్లిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించి.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, ఇజరోతు రాంబాబు, వెంపడాపు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:18 AM