Share News

International Standards అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో బోధన

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:06 AM

Teaching with International Standards జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశిం చారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు గణితంలో కూడా పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు.

  International Standards అంతర్జాతీయస్థాయి  ప్రమాణాలతో బోధన
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఏప్రిల్‌4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశిం చారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు గణితంలో కూడా పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుపై స్పష్టమైన అంచనా కోసం మౌఖిక పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం సంబంధిత గ్రామం లేదా పంచాయతీ పరిధిలో విద్యావంతులను బాహ్య పరీక్షకులుగా నియమించాలన్నారు. జూన్‌ నుంచి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ అమలులోకి వస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పు అంగన్‌వాడీల నుంచే ప్రారంభం కావాలన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు తగిన అభ్యాసనా సామర్థ్యాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రాథమిక పాఠశాలలు ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని పాఠశాలల ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని, అవసరమైతే ఉన్నతస్థాయి అధికారుల ద్వారా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. గురుకులాలు, పాఠశాలల తనిఖీ నివేదికలు, ఏపీవోల రివ్యూలు సక్రమంగా ఉండాలని, తనిఖీ చేసే అధికారం ఉన్న వారు కచ్చితంగా విజిట్‌ చేయాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో బాల్య వివాహాలను అరికట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ సబ్‌కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఏపీవో పి.మురళీధర్‌, ఉప సంచాలకులు ఎ.విజయశాంతి, డీఈవో పి.బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:06 AM