Teachers Drunk! ఆ మస్టార్లు.. మద్యం తాగి వస్తున్నారు!
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:32 PM
Teachers Reporting to School Drunk! విద్యాబుద్ధులు నేర్పి.. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం తాగి పాఠశాలలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కుంతేసు గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూలుకు తాళం వేసి నిరసన చేపట్టారు.
పాఠశాల ఎదుట నిరసన
గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పి.. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం తాగి పాఠశాలలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు కుంతేసు గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూలుకు తాళం వేసి నిరసన చేపట్టారు. స్కూల్ బ్యాగులను పాఠశాల ముందు ఉంచి.. విద్యార్థులకు ప్లకార్డులు ఇచ్చి ధర్నా చేశారు. ఈ పాఠశాలలో 54 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో ముగ్గురు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయులు తమ పిల్లలకు సక్రమంగా చదువు చెప్పడం లేదని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈవో శ్రీనివాసరావు కుంతేసు పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎం.సింహాచలం, ఎం.శ్రీనివాసరావు, ఎం.మజ్జియ్య మద్యం తాగి విధులకు హాజరవుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని, వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేస్తామని ఎంఈవో వెల్లడించారు.