Share News

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి’

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:02 AM

ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మడక బలరాంనాయుడు డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి’
మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బలరాంనాయుడు

రామభద్రపురం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మడక బలరాంనాయుడు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థికపరమైన సమస్యలతో పాటు వివిధ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. 2023 జూలై నాటికి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా రెండేళ్లైనా కనీస వేతనసవరణ సంఘాన్ని ఏర్పాటు చేయక పోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయు లకు గ్రాడ్యూటీ, సరండర్‌ లీవు, ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదన్నా రు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నుంచి కలెక్టరేట్‌ ఎదుట ఏపీటీ ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించను న్నామన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కాగాన సత్యారావు, ఏపీటీఎఫ్‌ మండల శాఖ అధ్యక్షుడు బొప్పే రవికుమార్‌, నాయకులు సువ్వాడ వెంకటప్పల నాయుడు, స్టేట్‌ కౌన్సిలర్‌ డోకల ర ఘురాం నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:02 AM