స్విమ్మింగ్‌లో ఉపాధ్యాయుడి ఘనత
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:33 AM
కుసుమూరు జీఈఎస్ (ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల)కు చెందిన ఉపాధ్యాయుడు బలగ గణేశ్ స్విమ్మింగ్‌లో మరో అరుదైన రికార్డు సాధించారు.
సీతంపేట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కుసుమూరు జీఈఎస్ (ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల)కు చెందిన ఉపాధ్యాయుడు బలగ గణేశ్ స్విమ్మింగ్‌లో మరో అరుదైన రికార్డు సాధించారు. బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు స్విట్జర్లాండ్ దేశంలో శనివారం యూరప్‌లో మూడో అతిపెద్ద సరస్సు లేక్ బోడెన్ సీలో వెట్ సూట్ లేకుండా 5.14 గంటల్లో 12 కిలోమీటర్ల దూరాన్ని స్విమ్మింగ్ చేసి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈతగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతటి రికార్డు సాధించడం వెనుక తన కోచ్ ఎన్.తులసీ చైతన్య శ్రమ ఉందని గణేశ్ తెలిపారు. ఇప్పటికే పలు రికార్డులు సాధించినానని, రానున్న కాలంలో మరిన్ని రికార్డులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.