ఉరితాళ్లతో టీచర్ల వినూత్న నిరసన
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:19 AM
2011 లోపు ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహన్‌రావు డిమాండ్ చేశారు.
బెలగాం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): 2011 లోపు ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీ మోహన్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు సులభతరమైన టెట్ నిర్వహిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు ఇందుకోసం ఈ నెల 26 నుంచి 30 వరకు బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.