ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:09 AM
ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక పరమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ నాయ కులు డిమాండ్ చేశారు. మంళవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి.. నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 12వ ఆర్థిక సంఘాన్ని వెంటనే నియమించాలని... 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం కలెక్టరేట్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు రావలసిన ఆర్థిక పరమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ నాయ కులు డిమాండ్ చేశారు. మంళవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి.. నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 12వ ఆర్థిక సంఘాన్ని వెంటనే నియమించాలని... 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులను భోదనకే పరిమతం చేయాలని డిమాండ్ చేశారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీలు భర్తీ చేయాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని కోరారు. ఎంఎస్‌టీ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 కు పెంచాలని కోరారు. వీరి నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఏపీ ఎన్‌జీవో అధ్యక్షులు సురేష్ మద్దతు తెలిపారు. సంఘ నాయకులు బలరాం నాయుడు, పైడిరాజు, ఈశ్వరరావు, శ్రీధర్ బాబు, సదాశివరావు, కృష్ణ, వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.