ఉపాధ్యాయిని ఆత్మహత్య
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:50 PM
బొబ్బిలి కుమ్మరి వీధి లో భర్త వేధింపులు తాళలేక ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యా యిని ఇంట్లో చున్నీతో ఆదివారం తెల్లవారుజామున ఉరిపోసు కుంది.
బొబ్బిలి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి కుమ్మరి వీధి లో భర్త వేధింపులు తాళలేక ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యా యిని ఇంట్లో చున్నీతో ఆదివారం తెల్లవారుజామున ఉరిపోసు కుంది. సీఐ కింతలి నారాయణరావు కథనం మేరకు.. స్థానిక చైతన్య స్కూల్‌లో లెక్కలు టీచరుగా సుంకరి మాధవీదేవి (39) పనిచేస్తోంది. 16 ఏళ్ల కిందట బాడంగి మండలంలోని చినభీమవరానికి చెందిన మర్రి నరేశ్‌ను ప్రేమించి పెద్దల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకుంది. అప్పట్లో నోబుల్ స్కూల్‌లో పనిచేసే నరేశ్ ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి 13 ఏళ్ల కుమార్తె సహస్ర, 15 ఏళ్ల నవదీప్ ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత మద్యానికి బానిసైన నరేశ్ ప్రతిరోజూ మద్యం సేవించి మాధవీదేవిని హింసిస్తుండేవాడు. ఇతరులెవరైనా ఫోన్ కాల్ చేస్తే అనుమానించి తాగి వచ్చి రోజంతా ఆమెతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం రాజాం పోలిపల్లి అమ్మ వారి దర్శనానికి వెళ్లాలని ముందురోజు రాత్రి అనుకున్నారు. ఇద్దరు పిల్లలు అమ్మమ్మగారి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఇంట్లో మాధవీదేవి, నరేశ్ మాత్రమే ఉన్నా రు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మాధవీదేవికి బంధువైన కిశోర్‌కు ఆమె భర్త నరేశ్ ఫోన్ చేసి ఆమె ఉయ్యాల చైన్‌కి చున్నీ కట్టి ఉరిపోసుకొన్నట్లు సమాచారం అందించాడు. కిశోర్ వెంటనే వారి ఇంటికి వెళ్లి మాధవీదేవి మెడకు ఉన్న చున్నీని తీసి ఆటోలో బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు సీహెచ్‌సీ వైద్యులు నిర్ధారించారు. నరేశ్ తమ కుమా ర్తెను శారీరక, మానసికంగా పెట్టిన బాధలు భరించలేకనే జీవితంపై విరక్తితో ఉరిపోసుకొందని మాధవీదేవి తల్లి సుంకరి లక్ష్మి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ మేరకుకేసు నమోదు చేశారు. శవపంచనామా జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మాధవీదేవికి తల్లి, చెల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.