Share News

Teacher ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:45 PM

Teacher Rationalisation Set to Begin జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు.

Teacher  ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం

పార్వతీపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో జడ్పీ, ఎయిడెడ్‌, యూపీ తదితర 1044 పాఠశాలల్లో 51,832 విద్యార్థులున్నారు. ఆన్ని యాజమాన్య బడుల్లో 6, 200 మంది ఉపాధ్యాయులు ఉండగా.. 328 పాఠశాలల్లో 449 మంది గురువులు ఎక్కువగా ఉన్నారు. 23 పాఠశాలల్లో 25 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌జీటీలు 333 మంది, గణిత ఉపాధ్యాయులు 8 మంది, పీఎస్‌ టీచర్లు 18 మంది, బయాలజీ ఉపాధ్యాయులు 17 మంది, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులు నలుగురు, సాంఘిక ఉపాధ్యాయులు 21 మంది, తెలుగు ఉపాధ్యాయులు 37 మంది, హిందీ గురువులు 11 మంది జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వీరందరినీ ఖాళీగా ఉన్న పోస్టుల్లో, విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. బోధనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుందని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.

Updated Date - Jul 03 , 2026 | 11:45 PM