Share News

అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:02 AM

నెల్లిమర్ల నగర పంచాయతీ గాంధీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి ఘటన కలకలం రేపింది.

అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి

  • మృతుడి భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు

నెల్లిమర్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీ గాంధీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమరాపు సామన్నదొర(45) గాంధీనగర్‌ కాలనీ ఎగువవీధిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన విజయ నగరం సంస్కృత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈయన ఆదివారం రాత్రి 8 గంటలకు భోజనం అనంతరం బయటకు వాకింగ్‌ నిమిత్తం వెళ్లారు. 20 నిమిషాల తర్వాత ఇంటికి వచ్చేశారు. ఇంటిలోపలకి అడుగుపెడుతుండగా గేటు వద్దే కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే సామన్నదొర మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయంపై మృతుని భార్య రవణమ్మ నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఎదురింటిలో నివసిస్తున్న ఉరిటి చంద్రరావు, ఆయన ఇద్దరు కుమారులతో పాటు స్థానిక నాయకుడు ఒకరు హత్య చేసి ఉంటారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్య కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోపాలరావు తెలిపారు. డీఎస్పీ లక్ష్మణమూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:02 AM