విద్యుదాఘాతంతో ఉపాధ్యాయుడి మృతి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:54 PM
ఎం.హరిపురం గ్రా మానికి చెందిన ఉపాధ్యాయుడు మర్రాపు ప్రసాద్ (59) విద్యుదా ఘాతానికి గురై ఆదివారం మృతిచెందారు.
జియ్యమ్మవలస, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఎం.హరిపురం గ్రా మానికి చెందిన ఉపాధ్యాయుడు మర్రాపు ప్రసాద్ (59) విద్యుదా ఘాతానికి గురై ఆదివారం మృతిచెందారు. చినమేరంగి ఎస్‌ఐ పి.అనీష్ కథనం ప్రకారం.. మర్రాపు ప్రసాద్ ఆదివారం ఉదయం తన పొలంలో అరటి పంట చూద్దామని వెళ్లారు. అయితే శుక్ర, శనివారాల్లో వీచిన ఈదురు గాలులకు అరటి తోట మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. తీగలను గమనించ కుండా వాటి మీదుగా వెళ్లడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడిక క్కడే మృతి చెందారు. ప్రసాద్.. టీకే జమ్ము పంచాయతీ పెదదోడిజ పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య ధనలక్ష్మి, కుమార్తె శ్వేత, కుమారు డు సూర్యవంశీ ఉన్నారు. పిల్లలు ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పి.అనీష్, ఏఎస్‌ఐ కాసులు ఘటపా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.