Share News

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

ABN , Publish Date - May 01 , 2026 | 12:36 AM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన గురువారం పార్వతీపురంలో జరిగింది.

  రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి

బెలగాం/రామభద్రపురం/ బొబ్బిలి ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యో తి): రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన గురువారం పార్వతీపురంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడు రెడ్డి వేణు (57) ద్విచక్ర వాహనంపై ఓ శుభకార్యం నిమిత్తం పార్వతీపురం మం డలం లక్ష్మీనారాయణపురం వస్తున్నారు. పార్వతీపురం పట్టణ శివారు ప్రాంతం వైకేఎం కాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వేణు తీవ్ర గా యాల పాలయ్యారు. స్థానికులు క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వేణు రామభద్రపురం మండలంలోని నాయుడువలస ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తు న్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై పార్వతీ పురం రూరల్‌ హెచ్‌సీ జి.జయరాం కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు వేణు ఆకస్మిక మృతిపై రామభద్రాపురం మండ ల విద్యా శాఖాధికారులు ఆమిటి తిరుమలప్రసాద్‌, పెంటయ్య, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకుడు జేసి.రాజు, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - May 01 , 2026 | 12:36 AM