ఉత్తమ ఫలితాల దిశగా బోధించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:57 PM
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపా ధ్యాయులు బోధించాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి సూచించారు.
కలెక్టర్ రామసుందర్‌రెడ్డి
గరివిడి జడ్పీ ఉన్నత పాఠశాల సందర్శన
గరివిడి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపా ధ్యాయులు బోధించాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి సూచించారు. గరివిడి జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయ న మంగళవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థు ల ప్రగతిపై హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎండీఎంను పరిశీలించారు. హెచ్‌ఎం నిర్మల, ఎంఈవో పి.రామారావులకు ఆయన పది ఫలితాలపై పలు సూచన లు చేశారు. అంతకముందు తహసీల్దార్ కార్యాల యాన్ని సందర్శించి, రికార్డులు పరిశీలించారు. భూములు రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశిం చారు. తహసీల్దార్ చింత బంగార్రా జు, ఎంపీడీవో ఎం.బాలసుబ్రహ్మణ్యం, ఎంఈవో పి.రామారావు, విద్యా, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.