TDP's నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:52 AM
TDP's Door-to-Door Campaign Begins Today కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించనున్నారు. మొత్తం 45 రోజుల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు
కూటమి అభివృద్ధి పాలన, సంక్షేమంపై విస్తృత ప్రచారం
పార్వతీపురం, జూలై26(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహించనున్నారు. మొత్తం 45 రోజుల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, నేతలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ రెండేళ్ల పాలనను వివరించాల్సి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్‌సిక్స్ సంక్షేమ పథకాలు అమలు , మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం పథకాలతో పాటు యువత, రైతులు, విద్యార్థులకు అందని లబ్ధిని ప్రజలకు తెలియ జేయాలి. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక పాలన, కూటమి సర్కారు అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చెప్పాలి. జిల్లావాసుల సమస్యలు, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి కుటుంబానికి తెలియజేయాల్సి ఉంది. కాగా ‘ఇంటింటికీ టీడీపీ’ నిర్వహణకు పార్టీ శ్రేణులు, జిల్లా నేతలు సన్నద్ధమయ్యారు. సోమవారం పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొనున్నారు. అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి , పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.