Share News

స్థానిక ఎన్నికల్లో టీడీపీదే విజయం

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:35 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

స్థానిక ఎన్నికల్లో టీడీపీదే విజయం
మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాలూరు నియోజకవర్గంలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతీ మండలానికి రూ. 20 కోట్లు, పట్టణానికి రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకున్నామన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి, వాటి ప్రారంభోత్సవాలను కూటమి ప్రభుత్వం చేపడుతోందన్నారు. గత పాలకులు శిలాఫలకాలకే పరిమిత మయ్యారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు నుంచి వంద మంది మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ వర్కర్లు మంత్రి సంధ్యారాణికి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 15 , 2026 | 12:35 AM