Share News

TDP leaders take oath టీడీపీ నాయకుల ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:31 AM

TDP leaders take oath టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి స్థానం పొందిన వారంతా బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

TDP leaders take oath టీడీపీ నాయకుల   ప్రమాణ స్వీకారం
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ప్రమాణం చేస్తున్న గంట్యాడ శ్రీదేవి

టీడీపీ నాయకుల

ప్రమాణ స్వీకారం

పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా శ్రీదేవి

జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపీ కలిశెట్టి

విజయనగరం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి స్థానం పొందిన వారంతా బుధవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా గంట్యాడ శ్రీదేవి, టీడీపీ జాతీయ అధికార ప్రతి నిధిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకట రావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, జోనల్‌ కో-ఆర్డినేటర్‌గా మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులుగా సంతకవిటి మాజీ ఎంపీపీ కొల్ల అప్పలనాయుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే తనయుడు కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు, రాష్ట్ర కార్యదర్శులుగా మాజీ ఎంపీపీ, జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, విజయనగరం ఏఎంసీ చైర్మన్‌ కర్రోతు నర్సింగరావు, టీడీపీ సీనియర్‌ నాయకుడు కరణం శివ రామకృష్ణ తదితరులు బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అభినందించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిమిడి నాగార్జున, ప్రసాదుల ప్రసాద్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 12:31 AM