Share News

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:17 AM

టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయనగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

విజయనగరం రూరల్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయనగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మె ల్యే అదితి గజపతిరాజు పాల్గొని, పార్టీ పతకాన్ని ఆవిష్కరించా రు. ఎమ్మెల్యే తోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జు న పాల్గొని, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని ఐదు డివిజన్లు, మండల పరిధిలోని ఆరు గ్రామాల యూనిట్‌ ఇన్‌చార్జులను సన్మానిం చారు.

శృంగవరపుకోట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి అన్నారు. ఎస్‌.కోట పట్టణంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవి ష్కరించారు. పార్టీలోని సీనియర్‌ నాయకులను సన్మానించారు.

రాజాం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావం నుంచి నేటివరకు ఎన్నో విప్లవాత్మక మార్ములకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఆదివా రం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బొబ్బిలి రోడ్డులో గల శ్రీదేవి కల్యాణ మండపం ప్రాంగణంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

చీపురుపల్లి/ గరివిడి/ గుర్ల, మార్చి 29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం చీపురుపల్లిలోని మండల పరిషత్‌ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కా ర్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నా యుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే గరివిడి, గుర్ల మం డల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీనియ ర్‌ కార్యకర్తలను సన్మానించారు.

బొబ్బిలి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకు డు ఎన్టీఆర్‌ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం బొబ్బిలి కోటలో పార్టీ పతాకాన్ని సీనియర్‌ దళిత కార్యకర్త, తెర్లాం మాజీ ఎంపీపీ బోడెల సింహాచలంతో ఆవిష్క రింపజేశారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

Updated Date - Mar 30 , 2026 | 12:17 AM