Share News

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:14 AM

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషిచేయాలని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎస్‌.రూపావతి విద్యార్థులు, సిబ్బందికి కోరారు.

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం
గురుకులంలో రికార్డులు పరిశీలిస్తున్న రూపావతి:

రేగిడి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషిచేయాలని గురుకులాల జిల్లా సమన్వయకర్త ఎస్‌.రూపావతి విద్యార్థులు, సిబ్బందికి కోరారు. మంగళవారం మండలంలో ఉంగరాడమెట్ట గురుకుళాన్ని తనిఖీచేశారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యాప్రమాణాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలని, ఉపా ధ్యాయులు బాధ్యతాయుతంగా మంచి ఫలితాలు తీసుకురావాలని ప్రిన్సిపా ల్‌ రఘురామ్‌నాయుడు, సిబ్బందికి సూచించారు. అనంతరం గురుకులంలో మెను, హాస్టల్‌ నిర్వహణను ఆరాతీశారు.

Updated Date - Nov 18 , 2026 | 12:14 AM