tallibidda Express Vehicles తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు వచ్చేశాయ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:38 PM
tallibidda Express Vehicles Arrive రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పది తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు జిల్లాకేంద్రానికి వచ్చేశాయి. సోమవారం వాటిని పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి ప్రాంగణంలో ఉంచారు. వాటి ద్వారా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు.
పార్వతీపురం టౌన్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పది తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు జిల్లాకేంద్రానికి వచ్చేశాయి. సోమవారం వాటిని పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి ప్రాంగణంలో ఉంచారు. వాటి ద్వారా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు. అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ వాహనాల్లో ఎయిర్‌బ్యాగ్స్, జీపీఎస్ లోకేషన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ, ఎమర్జెన్సీ బటన్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి వాటిని జిల్లాలో ప్రారంభించనున్నారు. కాగా దీనిపై డీసీహెచ్‌ఎస్ జి.నాగభూషణరావు మాట్లా డుతూ.. జిల్లా కేంద్రాసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం నూతన వాహనాలను ఏర్పాటు చేసిందన్నారు. తల్లీబిడ్డలను ఈ వాహనాల ద్వారా సురక్షితంగా ఇళ్లకు పంపిస్తామన్నారు. వైద్య, విదాన శాఖ ఆధ్వర్యంలో నూతన వాహనాల నిర్వహణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.