Share News

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:05 AM

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పఽథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు.

 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి
మాట్లాడుతున్న కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పఽథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు. బుధవారం గజపతినగరం పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ అభ్యర్థులతోపాటు ఎంపీపీ అభ్యర్థిగా గంటేడ శ్రీదేవి, కూటమి లో భాగంగా జడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డిపావనిని గెలిపించే బాధ్యత టీడీపీ నాయకులపై ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఈఎన్నికల ప్రభావం రానున్నపంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, ప్రతి కార్యకర్త కష్టబడి పనిచేయాలన్నారు. పార్టీలో చిన్న, చిన్న ఇబ్బం దులు ఉన్నా సరిదిద్దుకోవాలన్నారు. వైసీపీచేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, మాజీ మంత్రి పడాల అరుణ, నాయకులు కొండపల్లి కొండలరావు, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాల రాజు, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు గారతవుడు, అట్టాడలక్ష్మునాయుడు పాల్గొన్నారు.

సైనికుల్లా కదలండి

ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కోరారు. బుధవారం మండలంలోని కొత్తశ్రీంరగరాజపురం, లింగాలవలస గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయా లని సూచించారు. జోరుగాలివానలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Updated Date - Oct 29 , 2026 | 12:05 AM