Share News

గుమ్మిడిగెడ్డ’ నిర్మాణం చేపట్టండి

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:14 AM

నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌ కోరారు.

గుమ్మిడిగెడ్డ’ నిర్మాణం చేపట్టండి
ప్రభాకర్‌రెడ్డితో వీరేష్‌ చంద్రదేవ్‌

కురుపాం/పార్వతీపురం, ఫిబ్రవరి25 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో గుమ్మిడిగెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌ కోరారు. బుధవారం ఆయన కలెక్టర్‌, ఎస్పీ మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌తో నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు. అసంపూర్తిగా నిలిచిన పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేయాని కోరారు. నియోజకవర్గంలో రోడ్లు పనులు జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే ఎస్పీతో ఆయన పలు విషయాలు చర్చించారు.

Updated Date - Feb 26 , 2026 | 12:14 AM