కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:12 AM
కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి కోరారు.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్ జగదీశ్వరి కోరారు. మంగళవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో రెండేళ్ల ప్రభుత్వ పాలన, ఇంటింటా ప్రచారం, సర్‌పై పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. అలాగే, ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించి, ప్రతి ఓటు ఎంతో కీలకమన్నారు. ప్రతి బూత్ స్థాయి ఏజెంట్ తమ పరిధిలోని ప్రతి ఇంటికి బూత్‌స్థాయి అధికారితో కలిసి వెళ్లాలన్నారు. ఈ నెల 25 నుంచి రెండేళ్ల ప్రభుత్వ పాలన-ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలన్నారు. సమీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, కురుపాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదనరావు, నాయకులు అంబటి రాంబాబు, శేఖర్ పాత్రుడు, రంజిత్‌కుమార్ నాయక్, ఉరిటి రామారావు, నరేష్, కొండయ్య, జోగి భుజంగరావు, మరడాన నారాయణస్వామి, విజయాంకుశం, వెంపటాపు భారతి, కోట సుమన్, పాడి సుదర్శనరావు, కోలా రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.