సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టండి: కలెక్టర్
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:16 AM
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి సుస్థిర ఆర్థికాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి సుస్థిర ఆర్థికాభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. డీఆర్‌డీఏ వెలుగు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందుకు అంచనాలతో కాకుండా క్షేత్రస్థాయి విశ్లేషణ అవసరమన్నారు. ఈ ఏడాది కొత్తగా పది వేల మంది మహిళలను సంఘ సభ్యులుగా చేర్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. గత ఏడాది కాలంలలో సాధించిన లక్ష్యాలు, ఎదురైన సవాళ్లు, క్షేత్రస్థాయిలో లోపాలను విశ్లేషించి తదుపరి కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పారిశ్రామికవేత్తల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.