Share News

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:13 AM

: గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు.

 వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
హోమియో సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయకృష్ణ

వీరఘట్టం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. ప్రజ లకు చేరువగా వైద్యసేవలు అందేలా చూడాలని తెలిపారు. శనివారం వీరఘట్టంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పాలకొండ మండలంలోని భాసూరు, వీరఘట్టం మం డలంలోని తలవరం ఆయుష్‌ విభాగం హోమియో డిస్పెన్సరీలకు వచ్చిన హోమియో మందుల సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, వడదెబ్బ నివారణకు ఈ మందులు ఉపయోగపడతాయన్నారు. కార్య క్రమంలో డాక్టర్‌ పావని, డాక్టర్‌ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:13 AM