Share News

కేసుల దర్యాప్తును సవాలుగా తీసుకోండి: ఎస్పీ

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:03 AM

నేరస్వభావం మారుతుండడంతో కొత్తతరహా కేసులు నమోదవుతున్నాయని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు.

కేసుల దర్యాప్తును సవాలుగా తీసుకోండి: ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్‌, ఏఎస్పీ సౌమ్యలత

విజయనరం క్రైం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): నేరస్వభావం మారుతుండడంతో కొత్తతరహా కేసులు నమోదవుతున్నాయని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. ఈ తరుణంలో కేసుల దర్యాప్తును సవాలుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న వివిధ కేసులు, చార్జిషీట్ల సమీక్ష చేశారు. అనంతరం ఎస్పీ మట్లాడుతూ కేసుల మిస్టరీలను ఛేదించేందుకు సాంకేతికత ను అందిపుచ్చుకోవాలన్నారు. సోషల్‌ మీడియా దుర్వినియోగం.. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటివి తీవ్రంగా పరిగణించాలన్నారు. గంజాయి నియంత్రణ, మహిళల భద్రత, సైబర్‌ నేరాల నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్షేత్రస్దాయిలో నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సాక్ష్య యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు గోవిందరావు, ఎస్‌. రాఽఘవులు, వీరకుమార్‌, న్యాయసలహాదారులు వై.పరశురాం, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:03 AM