Share News

‘మెమోలను వెనక్కి తీసుకోండి’

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:36 PM

ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న 21 మంది ప్రధానోపాధ్యాయులకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీ మోహన రావు డిమాండ్‌ చేశారు.

‘మెమోలను వెనక్కి తీసుకోండి’
ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

పార్వతీపురం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న 21 మంది ప్రధానోపాధ్యాయులకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీ మోహన రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్‌ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోలు అప్‌లోడ్‌ చేయడం ఆలస్యమవుతుందని కారణంతో 21 మంది హెచ్‌ఎంలకు మెమోలు జారీ చేయడం దారుణమన్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు హెచ్‌ఎంలు కృషి చేస్తున్నారన్నారు. ఇటువంటి తరుణంలో ఉపాధ్యాయు లకు మానసిక ఒత్తిడికి గురిచేయడం సబబు కాదన్నారు. సీఎం చం ద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్‌, గుమ్మడి సంధ్యారాణి స్పం దించిన తమకు న్యాయం చేయాలన్నారు. బుధవారం ఐటీడీఏలో రాత్రి బస చేస్తామన్నారు. అప్పటోలోగా సమస్యను పరిష్కరించాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు కె.భాస్కరరావు, ఎ. భాస్కరరావు, జ్యోతి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:36 PM