Share News

మెగా ఉద్యోగ మేళాను వినియోగించుకోండి

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:09 AM

మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 23వ తేదీన పూసపాటిరేగ ఎస్‌వీఎస్‌ఆర్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.

మెగా ఉద్యోగ మేళాను వినియోగించుకోండి

భోగాపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈనెల 23వ తేదీన పూసపాటిరేగ ఎస్‌వీఎస్‌ఆర్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. మంగళవారం పోలిపల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాకు 17 కంపెనీలు హాజరు కానున్నాయని చెప్పారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసినవారు ఈ మేళాలో పాల్గొన వచ్చని చెప్పారు. ఇతర వివరాలకు 9550262700, 8688572605, 76608 28187 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Jan 21 , 2026 | 12:09 AM