Share News

స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:24 AM

స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.

స్వచ్ఛ రథాన్ని సద్వినియోగం చేసుకోండి

  • ఎమ్మెల్యే కళా వెంకటరావు

మెరకముడిదాం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. స్వచ్ఛరథం వద్ద పనికిరాని ప్లాస్టిక్‌, సీసాలు, పాత పేపర్లు, ఎలక్ర్టానిక్‌ వ్యర్థ పదార్థాలు ఇస్తే వాటి బరువుకు తగ్గట్టుగా సరుకులను పొందవచ్చని చెప్పారు. అనంతరం చెత్తల సేకరణ రిక్షాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు తాడ్డి సన్యాసినా యుడు, పార్టీ నాయకుడు కోట్ల మోతీలాల్‌నాయుడు, ఏఎంసీ చైర్మన్‌ తాడ్డి చంద్రశేఖర్‌(చందు), పార్టీ మండ ల కార్యదర్శి కె.ధనంజయ, జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు రౌతు కృష్ణవేణి, బీజేపీ మండల అధ్యక్షు డు సరిది రామునాయుడు, ఎంపీడీవో, తహసీల్దార్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాదర్బార్‌కు 43 వినతులు

మెరకముడిదాం మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ సమస్యలపై 43 వినతులు వచ్చాయి. వీటిని పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - Apr 29 , 2026 | 12:24 AM