ప్రభుత్వ పథకాలను వినియోగించుకోండి
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:14 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు.
ఎస్.కోట ఎమ్మెల్యే లలితకుమారి
లక్కవరపుకోట, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. శనివారం స్థానిక ఎస్సీ కాలనీలో ఆమె పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలకు విద్యు త్ భారం తగ్గించేందుకు సోలార్ సిస్టంను వినియోగిం చుకోవాలన్నారు. దళితులకు ఉచితంగా 2 కిలో వాట్స్ పవర్ సోలార్ సిస్టంను ప్రభుత్వం అందిస్తోందని తెలి పారు. నియోజకవర్గంలో 4,892 మంది ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ కనెక్షన్ ఉండగా.. అందులో 2,322 మందికి సో లార్ పథకం మంజూరు చేసినట్టు తెలిపారు. అదేవి ధంగా జిల్లాలో 15,018 లబ్ధిదారులకు రూ.170.48 కోట్ల ఖర్చుతో సుమారు 30 మెగా వాట్స్ సోలార్ విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వర రావు, చొక్కాకుల మల్లునాయుడు, జీఎస్.నాయుడు, మల్లా రామకృష్ణ రాజేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ లక్ష్మణ రావు, ఈఈ సురేష్‌బాబు, డిప్యూటీ ఈఈ బి.వెంకట రావు, ఏఈ రామారావు పాల్గొన్నారు.