Share News

ఎన్‌హెచ్‌ విస్తరణ పనులకు చర్య తీసుకోండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:36 PM

పెందూర్తి-బొడ్డవర (516బి) జాతీయరహదారి విస్తరణ(ఎన్‌హెచ్‌) పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి కోరారు.

  ఎన్‌హెచ్‌ విస్తరణ పనులకు చర్య తీసుకోండి
చంద్రబాబునాయుడుకు సమస్యలు వివరిస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి:

శృంగవరపుకోట/లక్కవరపుకోట, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పెందూర్తి-బొడ్డవర (516బి) జాతీయరహదారి విస్తరణ(ఎన్‌హెచ్‌) పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయు డును కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. పెందూర్తి-బొడ్డవర జాతీయ రహదారి నాలుగు రోడ్లుగా అందుబాటులోకి వస్తే ప్రపంచ పర్యాటక కేంద్రం అరకు అభివృద్ధి చెందు తుందని పేర్కొన్నారు. జలజీవన్‌ మిషన్‌ నిధులు త్వరగా విడుదల చేయాలని కోరారు. గీతం విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్‌ కోర్సును పూర్తి చేసిన కుమార్తె అన్వితా నాయుడును పరిచయం చేశారు. సీఎం అభినందించడంతోపాటు వైద్య వృత్తిద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

Updated Date - Jun 23 , 2026 | 11:36 PM